భూ సమస్యలు పరిష్కరించండి : ప్రత్యేక స్పందనలో కలెక్టర్ రంజిత్ భాష

Nov 29,2023 23:36

ప్రజాశక్తి – చిన్నగంజాం
మండలంలో భూ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మండలలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో జగనన్నకు చేబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి జగనన్నకు చేబుదాం కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. మండలంలో రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. గృహ నిర్మాణాలకు నివేశ స్థల పట్టాలు కావలసిందిగా అర్జీలు ఎక్కువగా వచ్చాయని అన్నారు. మండలంలో స్పందన అర్జీలు పరిష్కరం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గృహ నిర్మాణాల పనుల ప్రగతిపై ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖలో మూడు అర్జీలు ఓపెన్ అవటం పట్ల కలెక్టర్ పోలీసులను ప్రశ్నించారు. అర్జీదారుల కంటే అధికారులు అధికంగా కనిపించారు. అర్జీదారులు, అధికారుల పేర్లు పిలవటానికి మాత్రమే అధికారులు మైకులు ఉపయోగించారు. అర్జీదారులకు మైకు ఇవ్వకపోవడంతో అర్జీదారులు ఎలాంటి సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చింది మీడియాకు అర్థం కాలేదు. మూడు గంటలకు వచ్చిన కలెక్టర్ స్పందన అర్జీలు లేకపోవడంతో నాలుగు గంటల 30నిమిషాలకు వెళ్లిపోయారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్, డిఆర్‌ఒ పి వెంకట రమణ, చీరాల ఆర్‌డిఒ సరోజిని, చీరాల డిఎస్పి ప్రసాదరావు, డిఆర్డిఏ పిడి అర్జునరావు, గృహ నిర్మాణ శాఖ పిడి ప్రసాద్, డిపిఒ డి రాంబాబు, పంచాయతీ రాజ్ ఎస్ఇ హరి నారాయణ, పౌర సరఫరాల శాఖ డిఎస్ఓ విల్లేమ్స్, డిఎం శ్రీలక్ష్మీ, ఎంపీడీఓ స్వరూపరాణీ, తహసీల్దారు పి పార్వతీ పాల్గొన్నారు.

➡️