సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

May 26,2024 22:26 ##parchuru #ero #election

ప్రజాశక్తి – పర్చూరు
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా, బాధ్యతగా పని చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంధం రవీందర్ అన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయ ప్రాంగణంలో ఓట్ల లెక్కంపులో పాల్గొనే సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా క్రమ పద్ధతిలో లెక్కింపు ప్రక్రియ అత్యంత జాగ్రత్తతో పూర్తిచేసే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎఆర్‌ఒలు, రెవెన్యూ, పిఆర్, విద్యా తదితర శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️