రేషన్ అక్రమాలు జరిగితే కఠిన చర్యలు

Mar 6,2024 00:52

ప్రజాశక్తి – చెరుకుపల్లి
స్టేషన్ పంపిణీ సక్రమంగా జరగాలని, ఎటువంటి అవకతవకలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దారు బ్రహ్మయ్య హెచ్చరించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో రేషన్ డీలర్లు, ఎండియు వాహనదారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల కొరకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా సక్రమంగా పంపిణీ చేయాలని అన్నారు. రేషన్ డీలర్లు, ఎండియూలు అవగాహనతో ప్రజలందరికీ సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా విచారణ జరిపి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ తహాశీల్దారు, రేషన్ డీలర్లు, ఎండియు వాహనదారులు పాల్గొన్నారు.

➡️