కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు : బాపట్ల డిఎస్పి వెంకటేశులు

Jan 12,2024 00:06

ప్రజాశక్తి – బాపట్ల
సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి టి వెంకటేశులు హెచ్చరించారు. ఆయన ప్రజాశక్తితో గురువారం మాట్లాడారు. సంక్రాంతి పండుగ వేడుకలను సంప్రదాయంగా జరుపుకోవాలని అన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు కోడి పందాలు, ఇతర జూదం నిర్వహించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా కోడిపందేలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎవరైనా జూదం ఆడితే ఆయా స్టేషన్ల పరిధిలోని రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేస్తారన్నారు. కోడి పందాలు, జూదం ఆడుతున్నట్లు తెలిస్తే 100లేదా 112 నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. సంక్రాంతి సంబరాల్లో యువత క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలు నిర్వహించుకోవచ్చని అన్నారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

పంగులూరు : సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రేణింగవరం ఎస్‌ఐ కెకె తిరుపతిరావు హెచ్చరించారు. కోడి పందాలు, పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని విలేకర్ల సమావేశంలో చెప్పారు. సంతోషంగా కుటుంబాలతో పండుగ జరుపుకోవాలని కోరారు.

➡️