ఆలయ పాలకవర్గం ప్రమాణస్వీకారం

Mar 12,2024 00:00

ప్రజాశక్తి – పర్చూరు
స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ పాలకవర్గం సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్‌గా నియమితులైన రావువారి వెంకట శివప్రసాద్‌చే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పూజల్లో చేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్‌పెక్టర్‌ వేణుగోపాల్, ఈఒ వెంకటరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ కటారి అప్పారావు, లంక శివ, తులసి శివ నాగేశ్వరరావు, ఒగ్గిశెట్టి ప్రసాదు, మహారెడ్డి, రాము, కోట శ్రీనివాసరావు, యద్దనపూడి హరిప్రసాద్, పేర్ని హరి, బగిశెట్టి గోవిందరాజులు పాల్గొన్నారు.

➡️