గూడపల్లిలో ఇంటింటికీ టిడిపి

Mar 4,2024 00:18

ప్రజాశక్తి – చెరుకుపల్లి
బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని మండలంలోని గూడవల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించారు. టిడిపి సీనియర్ నాయకులు అనగాని శివప్రసాద్, పోషడుపు కుమారస్వామి టిడిపి సంక్షేమ పధకాలను గ్రామస్థులకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే టిడిపిని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. బాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు పురోగమిస్తుందని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మల్లాది రామకృష్ణ, తాత ఏడుకొండలు, కందుల వెంకటేశ్వరరావు, నాగుల పున్నారావు, పేరం శంకర్ బాబు, అనగాని శివ పాల్గొన్నారు.

➡️