తుఫాను బాధితులకు టిడిపి ఆర్థిక సాయం

Dec 12,2023 00:17

ప్రజాశక్తి – బాపట్ల
చంద్రబాబు పట్టణంలోని 3వ వార్డులో పర్యటించి తుఫాన్ భాదితులకు ప్రకటించిన రూ.5వేలు ఆర్ధిక సాయాన్ని స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ సోమవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ బారిన పడి నిరాశ్రయులైన రాజీవ్ నగర్ కాలనిలోని 47యానాదుల కుటుంబాలకు చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5వేల చొప్పున అందజేశారు. జిల్లా కేంద్రమైన బాపట్ల పట్టణంలోని అనేక కాలనీలు వర్షపు నీటిలో మునిగి పోయాయని అన్నారు. నీళ్ల మద్యలోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. 2024లో టిడిపి, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్ టు రిచ్ ఫథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ నుండే మొదలు పెట్టి ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.

➡️