టిడిపి ఎంపి అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌కు సత్కారం

Apr 7,2024 00:41 ##tdp #chirala

ప్రజాశక్తి – చీరాల
బాపట్ల పార్లమెంట్ టిడిపి ఎంపి అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం స్థానిక టిడిపి కార్యాలయంకు తొలిసారి వచ్చారు. ఆయనకు టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి ఎంఎం కొండయ్య, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయనను గజమాలతో సత్కరించారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రసాద్‌ను ప్రకటించిన తర్వాత ఆయన తొలిసారి చీరాలకు రావటంతో టిడిపి నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. భవిష్యత్తు కార్యాచరణపై కొద్దిసేపు నేతలతో చర్చించారు. టిడిపి గెలుపుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మహిళలకు ఉచత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచతం, 18ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.15వందనల నగదు, రైతు నిధు, యువగళం నిధి ద్వారా నిరుద్యోగ బృతి వంటి పధకాలను ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పాలని సూచించారు. ఎంఎల్‌ఎగా కొండయ్యను, ఎంపిగా తనను గెలిపించాలని కోరారు.

➡️