తిరుమలకు తెలుగుదేశం నేతల పాదయాత్ర

Jul 2,2024 01:00 ##Panguluru #tdp

ప్రజాశక్తి – పంగులూరు
రాష్ట్రంలో తెలుగుదేశం మరోసారి అధికారాన్ని చేపట్టడం, అద్దంకి శాసన సభ్యునిగా గొట్టిపాటి రవికుమార్ వరుసగా 5వ సారి విజయ సాధించి, మంత్రిగా ఎన్నిక కావడం పట్ల తెలుగుదేశం నాయకులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. వెంకన్నకు మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు పాదయాత్రగా సోమవారం బయలుదేరారు. టిడిపి రేణింగవరం నాయకుడు బోరెడ్డి ఓబులురెడ్డి నాయకత్వంలో సుమారు 30మంది తెలుగుదేశం కార్యకర్తలు కాలినడకన తిరుమలకు బయలుదేరారు. స్థానికంగా ఉన్న పోలేరమ్మ, నాంచారమ్మ, గంగమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి బయలుదేరారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు రావూరి రమేష్ బాబు, మాజీ డైరీ చైర్మన్ బాలిన రామసుబ్బారావు, చింతల సహదేవుడు మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి రావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బొప్పూడి నాగేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాసరెడ్డి, రామకూరు ఉపసర్పంచ్ పెడవల్లి అశోక్, గరిమిడి జగన్మోహనరావు, వలపర్ల సుబ్బారావు, అల్లంనేని బ్రహ్మానంద స్వామి, గుర్రం ఆదిశేకర్, అలవలపాడు సర్పంచ్ జకరయ్య, దాసరి హనుమంతరావు గౌడ్, గొల్లపూడి శేషగిరి పాల్గొన్నారు.


కొల్లూరు : టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయం సాధించిన సందర్భంగా మాజీ ఎంపీపీ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కనకాల మధుసూదన ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతికి 12రోజులు 62మంది బృందంతో మహా పాదయాత్రగా బయలుదేరారు. స్థానిక విజ్ఞేశ్వర ఆలయంలో 116 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి పూజలు చేశారు. శాసన సభ్యులు నక్క ఆనందబాబు సంఘీభావం తెలిపారు.


పర్చూరు : మండలంలోని దేవరపల్లిలో కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పర్చూరు శాసన సభ్యులుగా ఏలూరి సాంబశివరావు 3వ సారి హ్యాట్రిక్ విజేతగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శ్రీవెంకటేశ్వర స్వామి చెంతకు పాదయాత్రతో 30మంది యువకులు బయలుదేరారు. యాత్రను ఏలూరి సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. కాపు రవిచంద్ర, ఎంపీటీసీ కొమ్మాలపాటి సురేష్, కొరిటాల సురేష్, గండు నాగేశ్వరరావు, తోకల రాజశేఖర్, దొప్పలపూడి రాంబాబు, తోకల వేణుబాబు ఉన్నారు.

➡️