జగనన్నను మళ్ళీ సిఎం చేయటమే లక్ష్యం

Feb 11,2024 00:01

ప్రజాశక్తి – కర్లపాలెం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మరోసారి సిఎంగా చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఎంఎల్‌ఎ కోన రఘుపతి అన్నారు. స్థానిక పెద్దింటమ్మ కళ్యాణ మండపంలో శనివారం జరిగిన మండలంలోని బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించడంతోపాటు జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ సిఎంని చేయాలని కోరారు. సర్వేల్లో 68శాతం ఓటర్ల అభిమానంతో తను ముందంజలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరగటానికి మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన విజయం మనదేనని పార్టీ శ్రేణులను ఉత్సాహ పర్చారు. కార్యక్రమంలో సినీ రచయిత కోన వెంకట్, ఎంపీపీ యారం వనజ, వైసిపి మండల కన్వీనర్ యల్లావుల ఏడుకొండలు, ఎఎంసి చైర్మన్ సీతారామరెడ్డి పాల్గొన్నారు.

➡️