అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం అభినందనీయం

Jan 19,2024 00:17

ప్రజాశక్తి – పర్చూరు
అమరావతిలో స్మృతి వనం నిర్మిస్తామని దళితులను టిడిపి ప్రభుత్వం మోసం చేసిందని దళితన నాయకులు ఆరోపించారు. స్థానిక బొమ్మల సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. దశాబ్దాలుగా పాలకులు దళితులను మోసం చేస్తూనే ఉన్నారని దళిత నాయకులు కూరాకుల ఇస్సాకు ఆరోపించారు. 125అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్న ఏకైక సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో దళిత నాయకులు నూతలపాటి బలరాం, జూపూడి రోశయ్య, ఎడ్లపల్లి జయరాజు, వై రమేష్, శానం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️