కాంగ్రెస్‌తోనే దేశ అభివృద్ది

Dec 5,2023 00:03

ప్రజాశక్తి – చీరాల
దేశంలో ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ ఇంచార్జి దేవరపల్లి రంగారావు కోరారు. స్థానిక డ్రైనేజీ గెస్ట్ హౌస్‌లో మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం అదేశాల మేరకు కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడిగా పందరబోయిన సుబ్రహ్మణ్యంకు నియామక పత్రం సోమవారం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, జిల్లా అధ్యక్షులు గంట అంజిబాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ బలోపేతం చేసేందుకు కమిటీలు వేస్తున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు పేర్లి బుజ్జిరాజు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు యర్రాకుల శ్రీనివాసరావు, కాంగ్రెస్ వేటపాలెం మండల అధ్యక్షులు యెనుముల సూర్య ప్రదీప్, కర్రెద్దుల సురేష్, పట్టణ అధ్యక్షులు బండ్లమూడి విజయ్ కుమార్, మేరిగ రమేష్ బాబు, షేక్ బాషా పాల్గొన్నారు.

➡️