చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు

Jan 1,2024 00:25

ప్రజాశక్తి – బాపట్ల
చంద్రబాబు అధికారానికి వస్తేనే రాష్ట్రాభివృద్ది జరుగుతుందని టిడిపి ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. ఇంటింటికి టిడిపి, మీ మాటే – నా బాట, భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం మండలంలోని ముత్తయిపాలెం, చింతావారిపాలెంలో ఆదివారం నిర్వహించారు. మహిళలకు చీర, సంచి అందజేశారు. భవిష్యత్ కు గ్యారంటీ పత్రాల్లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేశారు.


చీరాల : పట్టణంలోని 24వ వార్డు టిడిపి కార్యవర్గాన్ని టిడిపి ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య పర్యవేక్షణలో ఎంపిక చేశారు. అధ్యక్షులుగా వావిలపల్లి రమేష్, ఉపాధ్యక్షుడు కల్లేపల్లి రమణారావు, ప్రధాన కార్యదర్శి పోలాకి రమణతోపాటు కార్యవర్గాన్ని నియమించారు. కార్యక్రమంలో యువనాయకులు ఎం అమర్నాథ్, పట్టణ అధ్యక్షులు గజబలి శ్రీనివాసరావు, డేటా నాగేశ్వరావు, లావేటి శ్రీనివాస్ తేజ, ఉసురుపాటి సురేష్, గంజి పురుషోత్తం, కర్పూరపు సుబ్బలక్ష్మి, కొండ్రు రత్నబాబు, పైలా శ్రీనివాసరావు, గంగవరపు వెంకన్న, పులిపాటి శేఖర్ పాల్గొన్నారు.

➡️