ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం

Nov 28,2023 23:59

ప్రజాశక్తి – భట్టిప్రోలు
జగన్‌ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆర్భాటంగా సంస్కరణలు మొదలు పెట్టింది. ఇంటి వద్దకే రేషన్‌ ఇస్తామని వాహనాలను ప్రవేశపెట్టింది. కానీ నేడు ఆ వ్యవస్థ అస్తవ్యస్తమైందని టిడిపి మైనార్టీ సెల్ వేమూరు నియోజకవర్గ అధ్యక్షులు సిరాజుద్దీన్ మంగళవారం ఆరోపించారు. ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో ఏర్పాటు చేసిన ప్రజా కంపెనీ వ్యవస్థకు అవసరమైన వాహనాలు నిరుయోగం అయ్యాయని అన్నారు. ఈ వాహనాల వలన ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఉన్న సరుకులు కూడా ప్రభుత్వం తగ్గించి వేసిందని ఆగ్రహ వ్యక్తం చేశారు. మొన్న కందిపప్పు నేడు పామాయిల్ సరఫరా నిలిపివేసి లబ్ధిదారులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. ప్రస్తుతం బియ్యం మాత్రమే అందిస్తున్నారని అన్నారు. దానికి ఇంత ఖర్చు చేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. గత టిడిపి ప్రభుత్వ పాలనలో ప్రజా పంపిణీతో పాటు అదనంగా పండుగ సమయంలో ఆయా రకాల తోపాలు అందించే వారిని అన్నారు. నేడు తోపాలు లేకపోగా నెలవారీ అందించే సరుకులు కూడా వైసిపి ప్రభుత్వం కోత విధించిందని అన్నారు. దీనివలన పేద ప్రజలకు ప్రతినెల రూ.వెయ్యి అదనపు ఖర్చు భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఒక రూపాయికి అందించాల్సిన బియ్యంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించిన బియ్యాన్ని కూడా నెలకు ఒకసారి మాత్రమే అందించి వైసిపి ప్రభుత్వం చేతులు దులుపుకుంటొందని ఆరోపించారు. రేషన్‌ షాపు ద్వారా అందించాల్సిన నిత్యవసర సరుకులు క్రమ క్రమంగా రద్దు చేయడంతో పేదలు బయట అధిక ధరలకు కొనుగోలు చేయలేక నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఒక డీలర్‌కు 550తెల్ల రేషన్ కార్డులు ఉంటే దానిలో 23శాతం కందిపప్పు, 55నుండి 60శాతం పంచదార, 50శాతం గోధుమపిండి మాత్రమే అందజేసి చేతులు దులుపుకుంటుందని అన్నారు. మిగిలిన వారికి ఏ విధంగా అందుతాయని ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి ఎండియు పథకం కింద రూ.వేలకోట్లు ఖర్చుపెట్టడం దేనికని ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పేద ప్రజలకు అందించాల్సిన నిత్యావసర సరుకులు సక్రమంగా అందించాలని కోరారు.

➡️