నాడు విద్యార్థులు.. నేడు ప్రజా ప్రతినిధులు

Feb 11,2024 22:33

– విఆర్ఎస్ అండ్ వై ఆర్ ఎం కళాశాల పూర్వ విద్యార్ధుల సమ్మేళనం
– హాజరైన మాజీ మంత్రులు గంట శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు
– ఆత్మీయ కలయక, మధురమైన జ్ఞాపకాలు
ప్రజాశక్తి – చీరాల
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయక మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసిందని, తమకు విద్యను అందించిన విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్‌ కళాశాల అనేకమంది నాయకులను తయారు చేసిందని మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని వాడరేవు పెరల్స్ బీచ్ రిసార్ట్స్ లో వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులైన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీ నటులు కొల్ల అశోక్ కుమార్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డి రమాదేవి, మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులను నాయకులుగా ఉన్నత స్థితిలో ఉండే విధంగా తయారు చేసిందని అన్నారు. కళాశాల వ్యవస్థాపకులకు నివాళి అర్పించారు. విద్యా బుద్ధులు చెప్పిన అధ్యాపకులను సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఇప్పటి విద్య కలుషితమైందని, విద్యలో నాణ్యత తగ్గిందని అన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఉన్నత స్థాయిలో ఉండే విధంగా తయారు చేయాల్సిన విద్యారంగం ఒక వర్గానికి చాందసభవాలతో తయారు చేసే విధంగా ఉన్నదని అన్నారు. వాటిని సంస్కరించాల్సిన బాధ్యత ఇప్పటి విద్యార్థులు, అధ్యాపకుల్లోనూ ఉన్నదని చెప్పారు.

➡️