ఆరోగ్య సిబ్బందికి శిక్షణ

May 23,2024 22:55 ##Addanki #HealthCenter

ప్రజాశక్తి – అద్దంకి
హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై వ్యాధి నిరోధక టీకాల జిల్లా అధికారి టి వెంకటేశ్వర్లు శిక్షణ ఇచ్చారు. పట్టణంలోని గీతా మందిరంలోని పిహెచ్‌సి, మోదేపల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కాకానిపాలెం, గాజులపాలెం పిహెచ్‌సిల ఆరోగ్య సిబ్బందికి శిక్షణ గురువారం నిర్వహించారు. జిల్లా గణాంక అధికారి పి వేణు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న ఆరోగ్య సేవలైన గర్భిణీ స్త్రీల నమోదు, కాన్పుల వివరాలు, రక్తహీనత, కుటుంబ నియంత్రణ, పాఠశాల ఆరోగ్య కార్యక్రమం తదితర అంశాలను హెచ్ఎంఎస్ ఫుట్ నందు ఎలా నమోదు చేయాలనే దానిపై వివరించారు. కార్యక్రమంలో హరికృష్ణ, పర్యవేక్షణ సిబ్బంది పాల్గొన్నారు.

➡️