యంత్ర పరికరాలపై శిక్షణ

Feb 8,2024 00:34

ప్రజాశక్తి – బాపట్ల
వ్యవసాయ యంత్రాల మరమ్మత్తుల నిర్వహణపై నైపుణ్యాభివృద్ధి సంస్త, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సౌజన్యంతో స్థానిక వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల్లో నిర్వహించిన రెండో రోజు శిక్షణ ముగింపు సభ బుధవారం నిర్వహించారు. సభలో కళాశాల అసోసియేట్ డీన్ స్మిత్ మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరలో వస్తున్న సాంకేతికను రైతులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవాలని అన్నారు. వ్యవసాయంలో సాంకేతికతపై స్థానిక వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల సహకారం అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బి జాన్‌వెస్లీ, కెవిఎస్ రామిరెడ్డి, బి హరిబాబు, జాన్ డీర్ ట్రాక్టర్ల తయారీ సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️