అమరజీవికి ఘన నివాళి

Dec 16,2023 01:11

ప్రజాశక్తి – అద్దంకి
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా మెయిన్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. రోటరీ ప్రెసిడెంట్ మలాది శ్రీనివాసరావు, కార్యదర్శి చప్పిడి వీరయ్య, పూర్వ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ ఉబ్బా దేవపాలన, షేక్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు, స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్తని, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో, హరిజనులకు దేవాలయాల ప్రవేశం కోసం పోరాడి విజయం సాధించారాని అన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారిని తమిళులు అవమాన పర్చటం చూసి సహించలేక, 58రోజులు నిరాహారదీక్ష చేసి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి అమరుడయ్యారని అన్నారు. ఆయన త్యాగం నేటి తరం తెలుసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తమ్మన శ్రీనివాసరావు, సంకా సుబ్రహ్మణ్యం, చుండూరి మురళీసుధాకరరావు, తమ్మన శ్రీనివాసరావు, డివిఎం సత్యనారాయణ, నాగసూరి సుబ్బారావు, అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసరావు, మురళి సుధాకరరావు పాల్గొన్నారు.
వేటపాలెం : సత్యం, అహింస, హరి జనోద్ధరన ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శుక్రవారం నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వైశ్య మాజీ జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రత్తి వెంకట సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు కోటి స్వామిగుప్తా, సెక్రటరీ సుబ్బారావు, గొడవర్తి రామకృష్ణ, ఊటుకూరి శ్రీమన్నారాయణ, పొన్నూరు రమేష్, జవ్వాది రంగనాథ గుప్తా, వాసవి క్లబ్ అధ్యక్షులు చుండూరు శ్రీనివాసులు, సెక్రటరీ నాని, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దోగుపర్తి బాలకృష్ణ, వనిత వైష్ణవి సంఘం అధ్యక్షులు తాతా సుజాత, అమరా సునీత, రీజనల్ చైర్మన్ చుండూరి గాయత్రి, తిరువీధుల ఉమామహేశ్వరరావు, సెనగపల్లి మోహనరావు, క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ కోడూరి రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇంకొల్లు రూరల్‌ : మండలంలోని ఇడుపులపాడు విద్యా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత తొలి ఉప ప్రధానమంత్రి, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి, తెలుగు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. హెచ్‌ఎం పిడపర్తి పేరిరెడ్డి నేతల త్యాగాలను విద్యార్ధులకు వివరించారు.
భట్టిప్రోలు : అమరజీవి పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వారి చిత్రపటాలకు ఎంపీపీ డివి లలిత కుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రధం సెంటర్‌, ఎంపీడీఒ కార్యాలయంలో గల పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ కన్వీనర్ కుందేటి రమేష్, ఎంపీడీఒ కుమార్, చంద్రశేఖర్, తహశీల్దారు ధూళిపూడి వెంకటేశ్వరరావు, ఏఒ శైలజ, వైసిపి నాయకులు మల్లేశ్వరరావు, టిడిపి నాయకులు ఎట్లా జయశీలరావు, కుక్కల వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, సిరాజుద్దీన్, కంభం సుధీర్ పాల్గొన్నారు.
చీరాల : చిరస్మరణీయులు పొట్టి శ్రీరాములని ఎమ్మెల్సీ పోతుల సునీత, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక ముక్కోణపు పార్కు సెంటర్లోని శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు గుంటూరు మాధవరావు, కౌన్సిలర్ ప్రభాకరరావు, శాఖకొల్లి రామసుబ్బులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️