కొండయ్యకు వాలంటీర్ల సత్కారం

Jun 15,2024 00:15 ##Chirala #MLA #Kondaiah

ప్రజాశక్తి – చీరాల
ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యను పట్టణంలోని ఐదవ వార్డు కౌన్సిలర్ సూరగని లక్ష్మీ, నరసింహారావు ఆధ్వర్యంలో ఆ వార్డులోని వాలంటీర్లు మర్యాద పూర్వకంగా స్థానిక టిడిపి కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గత ప్రభుత్వంలో తమ వార్డులో పలువురు వాలంటీర్లు వైసీపీ నాయకుల ఒత్తిళ్ళతో రిజైన్ చేసినప్పటికీ తమపై నమ్మకంతో మిగిలిన వాలంటీర్లు విధులకల్లో ఉన్నారని, వారికి తిరిగి అవకాశం కల్పించాలని కౌన్సిల్ సురగాని లక్ష్మి ఎమ్మెల్యే కొండయ్య దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కొండయ్యను వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, టిడిపి ముఖ్య నేతలు కలసి పుష్ప గుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు.

➡️