ఉపాధి కూలీల వేతనాలు చెల్లించాలి

Jun 16,2024 23:37 ##Vemuru #NREGS #Kolluru #CPM

ప్రజాశక్తి – కొల్లూరు
మండలంలోని తోకలవానిపాలెం, తురకపాలెం గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ ఆదివారం పరిశీలించారు. సంఘం మండల కార్యదర్శి బోనిగిల సుబ్బారావు, టి కృష్ణమోహన్ మాట్లాడుతూ పనిచేసిన 15రోజుల్లోపు ఉపాధి కూలీల వేతనం ఇవ్వాలని చట్టం చెప్తుంటే పనిచేసి 15 వారాలు గడిచిన వేతనాలు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఉపాధి కూలీలు పేదవారని, ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకుంటేనే కుటుంబం గడవని పేదలకు నెలలు తరబడిన కూలీ డబ్బు రాకపోతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఎక్కువ మంది కూలీలకు ఉపాధి పనులు లేక ఇళ్లవద్దే ఉంటున్నారని అన్నారు. కొంత మందికి వంద రోజులు మాత్రమే పని ఉంటుందని, అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కావున ఎన్‌ఆర్‌ఇజిఎస్ అధికారులు పంచాయతీ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పనుల అనుమతులు ఇవ్వాలని కోరారు. పనులకు అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు ప్రారంభం అవుతున్నందున వెంటనే ఉపాధి పనులను ప్రారంభించి పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధి హామీ మెట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

➡️