కెమిస్ట్, డ్రగ్గిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Mar 18,2024 01:36

ప్రజాశక్తి – బాపట్ల
కెమిస్ట్, డ్రగ్గిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంఎల్‌ఎ కోన రఘుపతి అన్నారు. స్థానిక ఎంఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. సభకు గుంటూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కెపి రంగారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ మారుతున్న కాలమాన పరిస్థితులు, ఆహారపు అలవాట్లతో ప్రజలు ఆరోగ్య రుగ్మతలతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన ఔషధాలను అందించడంలో కెమిస్ట్, డ్రగ్గిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
అసోసియేషన్‌ నూతన కార్యవర్గం
బాపట్ల జిల్లాలో నూతనంగా ఏర్పాటైన కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా చీరాలకు చెందిన చెంచయ్య, కార్యదర్శిగా కెవి కుమార్, కోశాధికారి సూర్యనారాయణరావు (జంపని) ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఎంవి వేణు మాధవరావు, శ్రీహరిరావు, కొల్ల ప్రకాశరావు, కొత్తమాసు వెంకటేశ్వరరావు వ్యవహరించారు. కార్యక్రమంలో సీమాంధ్ర డ్రగ్ డీలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్, కోశాధికారి టివి సుబ్రహ్మణ్యం, మూర్తి, ఎస్‌విఆర్ కుమార్, కెమిస్ట్ డ్రగ్గిస్ట్ వ్యాపారులు పాల్గొన్నారు.

➡️