గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాలి : ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్‌

Feb 8,2024 00:24

ప్రజాశక్తి -రేపల్లె
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి, జనసేన శ్రేణులు పనిచెయ్యాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంఎల్‌ఎ అనగాని సత్య ప్రసాద్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. రానున్న ఎన్నికలే ప్రధాన అజెండాగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను ప్రతి ఇంటికి అందేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఆరు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలుపే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడి శ్రమించాలని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన మహాశక్తి పథకాలు మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహద పడతాయని అన్నారు.

➡️