ఆస్ట్రేలియాలో టిడిపి అభివృద్ధికి కృషి

Jan 7,2024 23:34

ప్రజాశక్తి – పంగులూరు
ఆస్ట్రేలియాలో టిడిపి అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆస్ట్రేలియా టిడిపి ఇంచార్జ్ యెనికపాటి వెంకటేష్ అన్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడి, తన వంతుగా అక్కడ టిడిపి అభివృద్ధి కోసం ఇన్చార్జిగా పనిచేస్తున్న ఆయన సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన తూర్పు కొప్పెరపాడు వచ్చారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవికుమార్‌తో కొద్దిసేపు మాట్లాడారు. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగువారిలో టిడిపికి మద్దతు ఎక్కువగా ఉందని తెలిపారు. ఎపిలో పార్టీ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో అద్దంకితోపాటు రాష్ట్రంలో విజయ యాత్ర కొనసాగించాలని, చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా చేయాలని కోరారు. వైసిపి పాలనలో అస్తవ్యస్తమైన అభివృద్ధిని సక్రమ మార్గంలో నిలపాలని కోరారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఇక్కడ టిడిపి అభివృద్ధికి ఆస్ట్రేలియా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కరి వెంకట సుబ్బారావు, టిడిపి తూర్పు కొప్పెరపాడు ఏరియా కన్వీనర్ యెనికపాటి అశోక్ పాల్గొన్నారు.

➡️