భానుడి భగభగలు

ప్రజాశక్తి-పుల్లంపేట భానుడి భగభగతో ప్రజలు అల్లాడు తున్నా రు.ఉక్కపోత చికాకు పుట్టిస్తోంది. వడగల్పులు వెంటా డుతున్నాయి. ఈ వేసవి ఏప్రిల్‌ ప్రారంభం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అరకోర వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ పథకం పనులు గ్రామాల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజలు ఎండలకు భయపడి బయటకు రావడం కూడా తగ్గిపోయింది. ఇటు జనంతో పాటు అటు పంటలు కూడా ఎండ తాకిడికి పలు గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మండలంలో ప్రస్తుతం 44 డిగ్రీల నుంచి 46డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవు తు న్నాయి. ఎండ తీవ్రతకు జనం భయపడుతున్నారు. సాధా రణంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో అడపాదడపా కురిసే వర్షాలతో వాతావరణం చల్లబడాలి కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు మండుతున్నాడు. వేడి గాలుల తీవ్రత సాయంత్రం వరకు కొనసాగుతుండడంతో జనజీవనంపై ప్రభావం పడుతుంది. అసలే మండలంలో కాలువల ద్వారా పంటచేలకు సరఫరా చేసే నీరు వంతుల వారి విధానం కొనసాగుతోంది. రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎండలకు వ్యవసాయ కూలీలు అల్లాడు తున్నారు. కూలీలు పొలాల్లో సొమ్మసిల్లి పడిపోతున్నారు. మండలంలో అరటి, బొప్పాయి చేలల్లో కలుపు తీతలు మహిళా కూలీలు తీస్తుండగా పురుషులు చేలపై వ్యాపించిన తెగుళ్లు నివారణకు మందులు పిచికారి చేసే పనుల్లో నిమగ మవుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఎండలకు తట్టుకోలేక తరచు చేలగట్లపై సేదతీరుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఎండల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. మధ్యాహ్నం సమయాల్లో ఎండలకు భయపడి జనం బయటకు రాకపోవడంతో పుల్లంపేట, రెడ్డిపల్లి తదితర గ్రామాలలో రోడ్లు నిర్మాణస్యంగా ఉన్నాయి. రక్షణ చర్యలు చేపట్టాలి ఇలా..ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రాకుం డా ఉంటే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తెల్లని దుస్తులు, నల్లని కళ్లద్దాలు, టోపీ ధరించాలి. వదు ్ధలు, చిన్నపిల్లలు ఆ సమయాల్లో బయటికి వెళ్లకుండా ఉండ టం ఉత్తమం. పిల్లలు ఆడుకోవటానికి కూడా బయటకు వెళ్ళనీ యవద్దని వైద్యులు సూచిస్తున్నారు.చల్లని పదార్థాలకు డిమాండ్‌..మండలంలో ఎక్కడ చూసినా వేడిగాలు వీచడంతో ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. తాటి ముంజలు, కొబ్బరి బోండాలు, పుచ్చ కాయలు, కూల్‌ డ్రింక్స్‌, మజ్జిగ కోసం ప్రజలు తహత హలాడు తున్నారు. వీటికి గ్రామాల్లో కూడా డిమాండ్‌ పెరిగిపోయింది.వడదెబ్బ లక్షణాలు..తీవ్రమైన తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు కొన్ని సందర్భాల్లో వ్యక్తులు అపస్మారక స్థితిలోకి చేరుకోవడం, నీరసంతో సోమశిల్లి పడిపోవడం వడదెబ్బ తగిలిన వారికి మంచి గాలి, వెలుతురు, నీడ ఉండే ప్రాంతాల్లో ఉంచాలి. చెల్లడి తడి వస్త్రంతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలని వైద్యులు సూచించారు. ఆర్‌ఎస్‌ ప్యాకెట్లను కలిపి స్థాపించాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేక చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోజ్‌ ద్రావణం పట్టించాలని. అపస్మారకంగా ఉన్న దశలో మీరు తాగించకూడదని వైద్యులు పేర్కొన్నారు. వేసవిలో వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని పేర్కొన్నారు. వడదెబ్బ ప్రభావం పడకుండా పిల్లలను జాగత్త్రగా చూసుకోవాలన్నారు.

➡️