ప్రజలంతా ఆశీర్వదించండి

May 5,2024 21:36

ప్రజాశక్తి-బొండపల్లి:  రాష్ట్రంలో అరాచక పాలన నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు టిడిపి కూటమిని గెలిపించాలని టిడిపి ఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. బి.రాజేరు, గొల్లుపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని రంగాలను అభివృద్ధి వైపు నడిపిస్తారని అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా సహాయం చేసేందుకు దోహద పడతాయని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు కోరాడ కృష్ణ, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బండారు బాలాజీ, మాజీ వైస్‌ ఎంపిపి బొడ్డు రాము, ఎం.కొత్తవలస సర్పంచ్‌ కర్రోతు శ్రీనువాస రావు, కెరటాం సర్పంచ్‌ నబూరి రాజేష్‌, గేదెల మహేష్‌,తాతాజీ తదితరులు పాల్గొన్నారు.పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాలను పరిశీలించిన కలిశెట్టి విజయనగరం కోట : రాజాం నియోజకవర్గ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌కేంద్రాన్ని విజయనగరం పార్లమెంట్‌ స్థానం టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం పరిశీలించారు. పోలింగ్‌జరుగుతున్న రాజాంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వెళ్లి పరిశీలించారు. రాక్షస పాలన అంతమే ధ్యేయం : అశోక్‌గజపతిరాజు విజయనగరం కోట : రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే ఉమ్మడి కూటమి ధ్యేయమని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, విజయనగరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు అన్నారు. మండలంలోని చిల్లపేట, సారిక, జొన్నవలస గ్రామాలలో ఆదివారం ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో వారు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని, మహిళలకు రక్షణ ఉంటుందని, పోలవరం, రాజధాని పూర్తి అవుతాయని అన్నారు. మే 13న జరగబోవు ఎన్నికలలో కూటమికి మద్దతు తెలిపి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడుని ఎమ్‌పిగా గెలిపించాలని అదితి గజపతిరాజు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిని, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

➡️