అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్ విగ్రహాలు ఏర్పాటు

Dec 6,2023 16:16
br ambedkar death anniversay in mandapeta

ప్రజాశక్తి-మండపేట : పట్టణంలో వాణీమహల్ జంక్షన్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, వైసిపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడులు అన్నారు. బుధవారం విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజను కార్యక్రమం విగ్రహాల రూపశిల్పి వడయార్ తో కలిసి చేసారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళితవాడలకే పరిమితమైన మహనీయుల విగ్రహాలను వాణీమహల్ జంక్షన్ లో  ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిట్టురి సతీష్, ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, వైసిపి నాయకులు పలివెల సుధాకర్, వల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️