టిడిపి అభ్యర్థుల ప్రచారం

Apr 15,2024 21:45

ప్రజాశక్తి- బొబ్బిలి: రాష్ట్రాభివృద్ధికి కూటమి విజయం అవసరమని టిడిపి నాయకులు అన్నారు. కూటమికి మద్దతివ్వాలని ఉమ్మడి అభ్యర్ధి బేబీ నాయనని, ఎమ్‌పి అభ్యర్థి కలిశెట్టి అప్పల నాయుడును గెలిపించాలని సోమవారం టిడిపి నాయకులు మండలంలోని ఎరుకల పాకాల గ్రామంలో రాష్ట్ర ఎస్‌టి జనరల్‌ సెక్రటరీ, ఎంపిటిసి పాలవలస గౌరు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. చంద్రబాబును సిఎంగా చేయడం ద్వారా మహిళలు మరింత ఆర్థిక స్వావలంబన సాధిస్తారన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు సామాన్యులకు అండగా ఉంటాయన్నారు. ప్రతీ సారి ఎన్నికల ముందు జగన్‌ మోహన్‌ రెడ్డికి డ్రామాలు చేయడం అలవాటుగా మారిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, ఫార్లమెంట్‌ బిసి సాధికార కన్వీనర్‌ కొల్లి అప్పలనాయుడు, ఎంపిటిసిలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.తెర్లాం: మండల కేంద్రంలో టిడిపి అభ్యర్థి బేబినాయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ టిడిపి అధికారంలోకి వస్తే మండల కేంద్రంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిరంతరం మీకు అందుబాటులో ఉంటానని, తనను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. సైకిల్‌ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేకి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు వెంకట నాయుడు, మాజీ ఎంపిపి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్‌ రూప, ఎంపిటిసి భ్యులు ఆనందరావు, పలువురు టిడిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భామిని : మండల ప్రజలు ఓటు వేసి అసెంబ్లీ పంపిస్తే, పూర్తి స్థాయిలో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని పాలకొండ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ తెలిపారు. మండలంలోని బత్తిలిలో టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తల ఆధ్వర్యంలో ముమ్మరంగా ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, పార్టీ గుర్తు అయిన గ్లాస్‌పై ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండలం టిడిపి అధ్యక్షులు రవినాయుడు, మండలం జనసేన అధ్యక్షులు రుంకు కిరణ్‌, టిడిపి నాయకులు తేజోవతి, నియోజకవర్గం జనసేన కో ఆర్డినేటర్‌ జానీ, నిమ్మల నిబ్రం, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.కురుపాం : మండలంలోని పొడి, పొడిగూడ, ఒప్పంగి, సంతోషపురం, భూర్జమానుగూడ తదితర గిరిజన గ్రామాల్లో ప్రచారం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరినిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టిడిపి కన్వీనర్‌ కొండయ్య, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోలా రంజిత్‌ కుమార్‌, ఉమ్మడి పార్టీ నాయకులు ధూళీకేశ్వరరావు, రమేష్‌, రంగారావు, మాసయ్య, తదితరులు పాల్గొన్నారు.పాలకొండ : గిరిజనులకు అన్యాయం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని ఓడించడానికి గిరిజనులు సిద్ధంగా ఉన్నారని కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. సోమవారం టిడిపి నాయకులు సుంకర అనిల్‌ దత్త్‌ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నాలుగున్నర ఏళ్లలో నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌ పట్టించుకోలేదన్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంపై దృష్టి పెడతామని అన్నారు. బిజెపి ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సీతంపేటలో ఉన్న 8గ్రామాలని షెడ్యూల్డ్‌ ఏరియాలోకి చేరుస్తామని అన్నారు. వీరితో పాటు జనసేన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్‌, తదితరులు ఉన్నారు.

➡️