ఘనంగా టీ.డీ.జనార్ధన్‌ జన్మదినోత్సవ వేడుకలు

పెనుగంచిప్రోలు (ఎన్‌టిఆర్‌) : గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ పొలిట్‌ బ్యూరో సభ్యులు తొండపు దశరథ జనార్ధన్‌ జన్మదినోత్సవ వేడుకలు మాజీ సర్పంచ్‌ జిల్లేపల్లి సుధీర్‌ బాబు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల వెంకట సీతారామయ్య, మాజీ జెడ్పిటిసి గజ్జి కృష్ణమూర్తి కేక్‌ ను కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్‌ కర్ల వెంకటనారాయణ, జిల్లా మైనార్టీ సెల్‌ నాయకులు మహమ్మద్‌ అజాద్‌ జీల్లా, బీసీ సెల్‌ నాయకులు కందిమళ్ళ హనుమంతరావు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు నల్లపునేని కొండ, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి ప్రవీణ్‌, కంచిపోగు రవి, చింతల గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️