స్టెమ్‌ సెల్‌ మార్పిడితో సికిల్‌సెల్‌ ఎనీమియా చెక్‌

ఆరిలోవ, అపోలో హాస్పిటల్‌,

రాష్ట్రంలోనే మొట్టమొదటి అరుదైన అరుదైన వైద్యప్రక్రియ అపోలోలో విజయవంతం

ప్రజాశక్తి – ఆరిలోవ : ఆంధ్రప్రదేశ్‌లో స్టెమ్‌సెల్‌ మార్పిడితో సికిల్‌సెల్‌ అనీమియాను విజయవంతంగా ఆంధ్రాలోనే మొట్టమొదటిగా నయం చేయడం ద్వారా ఆరిలోవలోని అపోలో హాస్పిటల్‌, మెడికల్‌ ఆంకాలజీ వైద్యులు ఘనతను సాధించారు.విశాఖకు చెందిన 16ఏళ్ల యువరాజు అనే బాలునికి నాలుగేళ్లనుంచే తీవ్రమైన సికిల్‌ సెల్‌ అనీమియాతో బాధపడుతున్నాడు. అతని వ్యాధి నోటి మందులకు ప్రతిస్పందించడం ఆగిపోయింది. అతను రక్తమార్పిడి, ఎముకల నొప్పి తగ్గించడం కోసం పదేపదే ఆసుపత్రిలోచేరి వైద్యసేవలు పొందక తప్పని పరిస్థితి. ఈ సమయంలో, అతని కుటుంబం విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్‌లో మెడికల్‌ ఆంకాలజీ సీనియర్‌ కన్సల్టెంట్‌ అండ్‌ బిఎంటి ఫిజిషియన్‌ డాక్టర్‌ రాకేష్‌రెడ్డి బోయను సంప్రదించారు.రోగిని పూర్తిగా పరీక్షించిన తర్వాత అతనికున్న సికెల్‌సెల్‌ ఎనీమియా వ్యాధిని బోన్‌ మ్యారో (స్టెమ్‌ సెల్‌) మార్పిడి మాత్రమే నివారణ జరుగుతుందని డాక్టర్‌ రాకేష్‌ రెడ్డి బోయ వారికి వివరించారు. రోగి అన్నయ్యను దాతగా గుర్తించారు. అతని స్టెమ్‌సెల్స్‌ పూర్తిగా సరిపోలనప్పటికీ, కొన్ని మార్పులతో వాటిని సేకరించి వైద్యం చేయాలని అపోలో మెడికల్‌ ఆంకాలజీవైద్యులు భావించారు. అధిక మోతాదు కీమోథెరపీని నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే, రేడియేషన్‌తో శరీర రోగనిరోధక శక్తిని అణిచివేసేందుకు కాంపత్‌ ఉపయోగించారు. స్టెమ్‌ సెల్స్‌ పోస్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ రెండు నెలల తర్వాత బాధిత బాలుడు యువరాజు సికిల్‌ సెల్‌ అనీమియా సమస్యలు లేకుండా కోలుకున్నాడు. ఈ సందర్భంఆ డాక్టర్‌ రాకేష్‌రెడ్డి బోయ అపోలో ఆసుపత్రుల యాజమాన్యనికి రోగి కుటుంబీకులు కతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా స్టెమ్‌ సెల్స్‌తో సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధిని కట్టడిచేసే అరుదైన వైద్యప్రక్రియలో డాక్టర్‌ రాకేష్‌రెడ్డితోపాటు డాక్టర్‌ ప్రదీప్‌ వెంట్రపతి, డాక్టర్‌ సుమన్‌ దాస్‌, డాక్టర్‌ వేణి ప్రసన్న గేదల , డాక్టర్‌. రహీం, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️