అంబరాన్నంటిన హోలీ సంబరాలు

Mar 25,2024 21:49

ప్రజాశక్తి-చిత్తూరుడెస్క్‌: రంగు రంగుల హోలీ.. ఆనందాల రంగేళిగా నిలిచింది. స్థానిక మార్వాడీలు నెత్తకండ్రిగవద్ద గల శ్రీనివాసా కళ్యాణమండపం వద్ద సోమవారం హోలీ వేడుకలు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ, డ్యాన్సులు చేస్తూ సంతోషంగా గడిపారు. గ్రామాల నుంచి పట్టణాల వరకూ పిల్లల నుంచి పెద్దల వరకూ.. సంపున్నుల నుంచి సమాన్యుల వరకూ అందరూ ఎంతో ఈ వేడుకలకు హాజరై ఉత్సాహంగా, సంతోషంగా ఈ పండుగను జరుపుకొన్నారు. రంగులు పట్టుకుని ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ వేడుకలకు మంత్రి సోదరులు రామ్‌ప్రసాద్‌ రెడ్డి హాజరయ్యారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగులు చల్లుకొని వారితో ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బీడీభాస్కర్‌, బాలకష్ణ, గోపాల్‌రెడ్డి, దయానిధి, ఆనంద్‌కుమార్‌, ఎల్లప్పరెడ్డి, మురుగ తదితరులు పాల్గొన్నారు. వికోట: హోలీ పండుగ సందర్భంగా వికోటలో సందడి వాతావరణం నెలకొంది. చిన్నాపెద్ద అంతా రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. వికోటలో మార్వాడీల ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ పండుగకు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొన్నారు. వారికి చిన్నారులు సరదాగా రంగులు పూశారు. కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్‌, మార్వాడిలు లాభూరం, రాథోడ్‌, డక్లారం, హనుమాన్‌ సేట్‌, పీయన్‌ నాగరాజు, బాలగురునాథ్‌, తమీం ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. సోమల: హోలీ పండుగ పర్వదినాన్ని మండలం లోని పలుచోట్ల పిల్లలు మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. చిన్నారులు రంగులను చేత బూని ఒకరి కొకరు రంగులను పూసుకుంటూ రంగేళి హోలీ అంటూ గట్టి గా కేకలు వేస్తూ ఆనంద ఉత్సాహాంగా పండుగ చేసుకున్నారు.

➡️