ఆదుకోండయ్యా..

Dec 14,2023 22:47
ఆదుకోండయ్యా..

కేంద్రబృందాన్ని అర్థించిన రైతాంగం..రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్న కేంద్ర బృందం సభ్యులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌, రామకుప్పం: క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అందిన అభ్యర్థనలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి పరిష్కరించేందుకు కషి చేస్తామని మినిస్ట్రీయల్‌ సెంట్రల్‌ టీం (ఐఎంసిటి) సభ్యులు కష్ణ, గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ డైరెక్టర్‌ పి.దేవేంద్రరావు తెలిపారు. గురువారం జిల్లాలోని పలమనేరు మండలంలోని గుండ్లపల్లి, శ్రీరంగరాజపురం గ్రామాలలో వేరుశెనగ పంట పొలాలలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులుతో కలసి ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం (ఐఎంసిటి) పర్యటించారు. ఈ పర్యటనలో బంద సభ్యులు డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ అనిమల్‌ హస్బెండరీ మరియు డైరీయింగ్‌ అంజు బసెరా, ఎంఎన్‌సిఎఫ్‌సి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా.ప్రదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా జేసి మాట్లాడుతూ జిల్లాలో పలమనేరు, రామకుప్పం, గంగవరం, రొంపిచర్ల మండలాలను కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించిందని తెలిపారు. కరువు మండలాలలో రైతులు పడుతున్న ఇబ్బందులను అంచనా వేయడానికి కేంద్ర బందం జిల్లాకు రావడం జరిగిందన్నారు. పలమనేరు, రామకుప్పం మండలాలలో నీటిలభ్యత తక్కువగా ఉందని, ఈ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు పండిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోవడం జరుగుతున్నదని, శాశ్వత నీటివసతి లేదని కేంద్ర బందానికి జేసి వివరించారు. జిల్లాలో ఖరీఫ్‌ 2023కు 51,266 హెక్టార్ల వేరుశనగ పంట లక్ష్యం కాగా వర్షాభావ పరిస్థితుల కారణంగా 15,038 హెక్టార్లు పంట మాత్రమే సాగు చేయడమైనదని తెలిపారు. పలమనేరు మండలం గుండ్లపల్లిలో గల వేరుశెనగపంట పొలంలో రైతులతో కరువు బృందం ముఖాముఖి నిర్వహించారు. రైతులు కరువు బందానికి వివరిస్తూ… కరువు కోరల్లో చిక్కున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ముక్తకంఠంతో అర్థించారు. ఒక ఎకరా వేరుశెనగ పంటకు దాదాపు రూ.30,000 నుండి రూ.35,000 ఖర్చు అవుతున్నదని, పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నామని, ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకోపోవడంతో చెరువులలో నీటి లభ్యత లేదని, స్వంత ట్రాక్టర్లు లేవని, నాణ్యమైన విత్తనాలు లభించడం లేదని, పశు సంపదపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు మేలు చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ఉపాధి పనిదినాలను పెంచాలని కోరారు. ఏనుగుల దాడి వలన పంట నష్టపోతున్నామని, సోలార్‌ లైట్‌లు అమర్చి ఏనుగుల భారినుండి పంటను రక్షించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రైతులు కేంద్ర బందం ముందు విన్నవించారు ఐఎంసిటి సభ్యులు, కష్ణ, గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ డైరెక్టర్‌ పి.దేవేంద్ర రావు మాట్లాడుతూ కరువు మండలాలలో నీటి లభ్యత తక్కువ ఉన్నదని, డ్రిప్‌ ఇరిగేషన్‌, మైక్రోఇరిగేషన్‌ ద్వారా పంట పండిస్తున్నారని, ఈసంవత్సరం కరువు భారినపడి రైతులు నష్టపోవడం జరిగిందన్నారు. వేరుశెనగపంట కొరకు రైతులు ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, పంటకు సరియైన గిట్టుబాటు ధరలేవని రైతులు తెలిపారన్నారు. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ఉపాధి పనిదినాలను 100 నుండి 150 రోజులు పెంచాలని రైతులు బందానికి నివేదించారన్నారు. ఈ విషయాలను క్రోడీకరించి సంక్షిప్త నివేదికను ప్రభుత్వానికి సమర్పించి రానున్న ఎండాకాలంలో కరువు నుండి రైతాంగాన్ని కాపాడేందుకు కషి చేస్తామని అన్నారు. అనంతరం శ్రీరంగరాజపురంలో నష్టపోయిన వేరుశనగ పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ పర్యటనలో డ్వామా పిడి గంగాభవాని, జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళీకష్ణ, జిల్లా ఉద్యాన శాఖఅధికారి మురళీధర్‌ రెడ్డి జిల్లా పశు సంవర్థక శాఖాధికారి ప్రభాకర్‌, జిల్లా పట్టుపరిశ్రమ అధికారి శోభారాణి, పలమనేరు ఆర్డిఓ మనోజ్‌ కుమార్‌ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీ ప్రసన్న, జిల్లా భూగర్భ జలవనరుల శాఖాధికారి గోవర్ధన్‌ రెడ్డి, పలమనేరు రూరల్‌ తహశీల్దార్‌ కుప్పుస్వామి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️