ఆరోగ్యశ్రీ.. పేదలందరికీ వరంశ్రీ వైద్య ఖర్చు పరిమితి రూ.25లక్షలకు పెంపుశ్రీ గడిచిన నాలుగేళ్లుగా జిల్లాలో రూ.635కోట్లతో 33లక్షల మందికి పథకం వర్తింపజేశాంశ్రీ ఆరోగ్య ఆసరా ద్వారా రూ.62కోట్ల ఖర్చుతో లక్ష30వేల మందికి అందించాంశ్రీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి

Dec 18,2023 23:16

ఆరోగ్యశ్రీ.. పేదలందరికీ వరంశ్రీ వైద్య ఖర్చు పరిమితి రూ.25లక్షలకు పెంపుశ్రీ గడిచిన నాలుగేళ్లుగా జిల్లాలో రూ.635కోట్లతో 33లక్షల మందికి పథకం వర్తింపజేశాంశ్రీ ఆరోగ్య ఆసరా ద్వారా రూ.62కోట్ల ఖర్చుతో లక్ష30వేల మందికి అందించాంశ్రీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడిప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య ఖర్చు పరిమితి రూ.25లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వెలగపూడి సిఎం క్యాంప్‌ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా సచివాలయం నుంచి మంత్రితో పాటు జెడ్పి ఛైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌, ఎస్‌.పి రిషాంత్‌రెడ్డి, నగర మేయర్‌ అముద, చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ కెజే.శాంతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జబ్బులతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి వారికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలలోనూ కార్పొరేట్‌ ఆసుపత్రులలో దాదాపు 3200 జబ్బులకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న వైద్య ఖర్చు పరిమితి రూ.25 లక్షల వరకు పెంచిందని, ఈ పథకం పేద వారికి సీఎం అందించిన వరం అన్నారు. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఉచితమైన వైద్యం అందించడం జరుగుతున్నదన్నారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా రాష్ట్రంలో ప్రతి ఏడాది దాదాపు రూ.4,100 కోట్లు ఖర్చు చేయడం జరుగుతున్నదన్నారు. నాడు-నేడుతో ఆసుపత్రులను ఆధునీకరణ, వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులను నియమించడం, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు, వైద్య కళాశాలలో రిసెర్చ్‌ సెంటర్‌లను ఏర్పాట్లు చేసుకోవడం జరగిందన్నారు. ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కళాశాలల ఆధునీకరణ, నిర్మాణంలో ఉన్న 17 మెడికల్‌ కళాశాల నిర్మాణపు ఖర్చులు మొత్తం రూ.32,279 ఖర్చు చేశారన్నారు. ఆరోగ్య సురక్ష మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వైద్య పరీక్షలు చేసిన జిల్లాల్లో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. 2024 జనవరి 2 నుండి ప్రారంభం కానున్న రెండవ విడత కార్యక్రమంను అదే స్థాయిలో నిర్వహించి ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో గత నాలుగున్నర సంవత్సర కాలంలో దాదాపు 33,20,000 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించుటకు రూ.635 కోట్లు, శస్త్ర చికిత్స అనంతరం అందించే ఆరోగ్య ఆసరా ద్వారా 1,30,000 మందికి రూ.62 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో 4,73,877 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేశామని, 77 నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. రెండవ విడత ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఎం్‌హెచ్‌ఓ డా.ప్రభావతి దేవి, జెడ్పీ సిఈఓ ప్రభాకర్‌ రెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ డా.సుదర్శన్‌, డిపిఓ లక్ష్మి, డిఐఓ డా.రవిరాజు, చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్‌ డా.అరుణ్‌ కుమార్‌, సంబంధింత అధికారులు, కార్పొరేటర్‌ హరిణి రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.

➡️