ఈ కొలువులు మాకొద్దు సార్‌..

Mar 26,2024 21:27
ఈ కొలువులు మాకొద్దు సార్‌..

శ్రీ 12మంది వలంటీర్లు, నలుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల రాజీనామాప్రజాశక్తి-వికోట: మండలంలోని కుంబార్లపల్లి సచివాలయానికి చెందిన 12మంది వలంటీర్లు తమ కొలువులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఎంపీడీవో గోవర్ధన్‌కు రాజీనామా పత్రాలను అందజేశారు. స్పందించిన ఎంపీడీవో ఆ పత్రాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.నలుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు రాజీనామా మండలంలో ఉపాది హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న నలుగురు మంగళవారం తమ విధులకు రాజీనామా చేశారు. గోనుమాకులపల్లికి చెందిన దివాకర్‌, బైరుపల్లికి చెందిన కీర్తిన, మణికుమార్‌, కష్ణాపురం చెందిన వెంకటేష్‌లు తమ ఉద్యోగాలుకు రాజీనామ చేస్తూ లేఖలను చిత్తూరు జిల్లా డ్వామా పీడీ రాజశేఖర్‌కు సమర్పించారు. డ్వామా పీడీ వారి రాజీనామా లేఖలను ఆమోధించి వారిని విధుల నుండి తొలిగిస్తూ, తదుపరి చర్యలు తీసుకోవడానికి స్థానిక ఎంపి డివో గోవర్ధన్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క రోజే నలుగురు ఉపాది హామీ సిబ్బంది, 12 మం ది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేయడం మండలంలో చర్చనియాంశంగా మారింది.

➡️