ఉత్సాహంగా ఆడేద్దాం.. ‘ఆడుదాం ఆంధ్ర’

Dec 23,2023 22:38
ఉత్సాహంగా ఆడేద్దాం.. 'ఆడుదాం ఆంధ్ర'

ఇన్‌ఛార్జి కలెక్టర్‌ శ్రీనివాసులు ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడోత్సవాల్లో ఆటలు ఆడాలని ఇన్చార్జి కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ సన్నాహక ర్యాలీని ఇన్చార్జి కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్‌ ఎస్‌. అముద, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈర్యాలీలో విద్యార్థులు, యువత, ఉద్యోగులతో కలిసి అధికారులు ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. ఈసందర్భంగా ఇన్చార్జి కలెక్టర్‌ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ… ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్న ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడోత్సవాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, యువత విద్యార్థుల్లో ఉత్సాహం నింపడం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో అన్ని వార్డు/గ్రామ సచివాలయాలు, మండల కేంద్రాల్లో ర్యాలీలో నిర్వహిస్తున్నట్లు ప్రజల్లో క్రీడలపై అవగాహనాన్ని పెంచడం, యువతలో ఆసక్తిని పెంపొందించడం కోసం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల్లో ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరూ పాల్గొని బహుమతులు గెలుచుకోవాలన్నారు. యువత, మహిళలు, విద్యార్థుల్లో దాగిన క్రీడాప్రతిభను వెలికి తీయడం కోసం గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 26 నుంచి జనవరి 9వ తేదీ వరకు గ్రామ /వార్డు స్థాయిలోనూ, జనవరి 10నుంచి మండల స్థాయిలో, జనవరి 24 నుంచి నియోజక వర్గ స్థాయిలో, జనవరి 31 నుండి ఫిబ్రవరి 5 వరకు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. ఆడుదాం..ఆంధ్ర.. క్రీడోత్సవాలను విజయవంతం చేయడం కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల్లో వ్యాయామం, క్రీడలపట్ల ఆసక్తి పెంచడం కోసం ఈ క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేయర్‌ అముద మాట్లాడుతూ క్రీడాకారులలో దాగిన ప్రతిభను వెలికి తీయడానికి ఉద్దేశించిన ఈ క్రీడల్లో యువత విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుపొందాలని ఆకాంక్షించారు. జడ్పీ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, హౌసింగ్‌, డ్వామా పిడీలు పద్మనాభం, గంగాభవాని, డిపిఓ లక్ష్మి, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బానీ బాష, డిఎల్‌డిఓ రవికుమార్‌, జిల్లా స్పోర్ట్స్‌ అధికారి బాలాజీ, జిల్లా కార్మికశాఖ అధికారి ఓంకార్‌, కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ, సహాయకమిషనర్‌ గోవర్థన్‌, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్‌, సీఎంఎం గోపి పాల్గొన్నారు.

➡️