ఎక్కడ చూసినా సమస్యల వెల్లువనియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌ ధ్వజం

ఎక్కడ చూసినా సమస్యల వెల్లువనియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌ ధ్వజం

ఎక్కడ చూసినా సమస్యల వెల్లువనియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌ ధ్వజంప్రజాశక్తి- నగరి: ఎక్కడ చూసినా ప్రజలు అవస్థలు పడుతున్నారని, వైసీపీ పాలనలో నగరి నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌ ధ్వజమెత్తారు. బుధవారం నగరి మున్సిపాలిటీ 1వ వార్డు, 2వ వార్డు మీకోసం మీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో ఏ వీధి చూసినా, ఏ గ్రామం చూసినా సమస్యల వలయంలో చుట్టుకుని ఉన్నాయని, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు, 2వ వార్డు నగరిపేట, రాజీవ్‌ నగర్‌, కాకవేడులలో గాలి భానుప్రకాష్‌ ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గాలి భానుప్రకాష్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, రోడ్లు, కాలువలు లేక ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారని తెలియజేశారు. నగరి నియోజకవర్గ అభివద్ది తెలుగుదేశంతోనే సాధ్యమని, ప్రజల కష్టాలు తీరాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే సైకిల్‌ ప్రభుత్వం రావాలని, తనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు గ్యారెంటీ పథకాలైన సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు.

➡️