ఎన్నికల ఏర్పాట్లను వివరించిన కలెక్టర్‌, ఎస్పీ

Dec 23,2023 22:31
ఎన్నికల ఏర్పాట్లను వివరించిన కలెక్టర్‌, ఎస్పీ

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సమగ్ర ప్రణాళికతో సాధారణ ఎన్నికల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రతినిధుల బందం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్రశర్మ సారథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌)-2024 సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై నోవాటెల్‌ హౌటల్‌ విజయవాడలో రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో రెండవ రోజు వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌ వ్యాస్‌బీ స్వీప్‌ డైరెక్టర్‌ సంతోష్‌ అజ్మేరా, అండర్‌ సెక్రటరీ సంజరు కుమార్‌తో పాటు ఏపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా, అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరేంధిర, జాయింట్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్‌ పోలీస్‌ నోడల్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల సన్నద్ధతపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ వివరించారు. పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎన్నికల ఏర్పాట్లు వివరిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

➡️