ఎన్నికల నిర్వహణకు విభాగాల ఏర్పాటు

Mar 11,2024 22:05
ఎన్నికల నిర్వహణకు విభాగాల ఏర్పాటు

ఎన్నికల నోడల్‌ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికలు- 2024కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అనుసరించి ఎన్నికల విధులను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ తెలిపారు. సోమవారం డిఆర్‌డిఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులుతో కలసి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణకు ఏర్పాటు చేసిన విభాగాల నోడల్‌ అధికారులు, సంబంధిత సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈసమావేశంలో డిఆర్‌ఓ బి.పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలును సజావుగా నిర్వహించుటకు వివిధ విభాగాలను ఏర్పాటు చేసి నోడల్‌ అధికారులను, సిబ్బందికి కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మీడియా మేనేజ్మెంట్‌, ఎంసిఎంసి, సోషల్‌ మీడియా యూనిట్‌, కాంప్లెయింట్‌ రిడ్రసల్‌ సెల్‌, మానిటరింగ్‌ సెల్‌, 1950 కాల్‌ సెంటర్‌, ఎన్‌ఎస్‌జిపి యూనిట్‌, ఎంసిసి మానిటరింగ్‌ యూనిట్‌, రిక్వెస్ట్‌ అండ్‌ పర్మిషన్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, రిపోర్ట్స్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌/ మ్యాన్‌ పవర్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, ఎలాక్టోరల్‌ రోల్స్‌, ఎపిక్‌ కార్డ్స్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, పోలింగ్‌ స్టేషన్స్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, ట్రైనింగ్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, బ్యాలట్‌ అండ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, హోమ్‌ ఓటింగ్‌ ఫర్‌ ఆబ్సెంటీ వోటర్స్‌, మెటీరీయల్‌ ప్రొక్యూర్మెంట్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, ట్రాన్స్‌ పోర్టేషన్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, కమ్యూనికేషన్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, అబ్జర్వర్‌ యూనిట్‌, ఎక్స్పెండిచర్‌ మానిటరింగ్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, స్వీప్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, లా అండ్‌ ఆర్డర్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, ఈవిఎం మేనేజ్మెంట్‌ యూనిట్‌, నామినేషన్స్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌, పోల్‌ డే అరేంజ్మెంట్స్‌ యూనిట్‌, స్పెషల్‌ నీడ్స్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌ వంటి విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నోడల్‌ అధికారులు, తమకు కేటాయించిన సిబ్బంది ఎన్నికలు ముగిసే వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తించాలన్నారు. ప్రతి విభాగంలోని నోడల్‌ అధికారి, వారి సిబ్బందికి ఎన్నికల కోడ్‌ సమయంలో నిర్వర్తించవలసిన విధులను వివరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల ఎన్నికల నోడల్‌ అధికారులు సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన సంబంధిత విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించవలసి ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి తీసుకోవలసిన చర్యలు, రిపోర్ట్‌ల తయారీ వంటివి నిర్దేశిత కాలంలో పంపవలసి ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల హ్యాండ్‌ బుక్‌పై అవగాహన ఉండాలి: కలెక్టర్‌ గంగాధరనెల్లూరు: ఎన్నికల విధుల నిర్వహణ హ్యాండ్‌ బుక్‌పై అధికారులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ షన్మోహన్‌ సూచించారు. సోమవారం జీడీనెల్లూరు తహశీల్దార్‌ కార్యాలయంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంకి సంబంధించి నామినేషన్లు ప్రక్రియ, పోస్టల్‌ బ్యాలెట్‌, ఎంసీసీ, ఎలక్షన్స్‌ వ్యయం, ఎస్‌ఎస్‌టి, ఎఫ్‌ఎస్‌టి, విఎస్‌టి, వివిటి, అకౌంట్స్‌, ఫిర్యాదులు, రిపోర్ట్స్‌, రవాణా, పోలింగ్‌, మేనేజ్మెంట్‌ వంటి టీమ్స్‌లోని అధికారులు ఎలక్షన్స్‌లో నిర్వహించవలసిన బాధ్యతలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో జెసీ శ్రీనివాసులు, నియోజకవర్గ ఆర్‌వో వెంకటశివ, తహశీల్దార్‌ రవి, డీటీ విజయకష్ణ, ఏఎస్‌వో ఆనందమోహన్‌, పలువురు తహశీల్దార్లు, ఎంపిడివోలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

➡️