ఎన్నికల బరిలో ఉంటా..డికె ఆదికేశవులు మనవరాలు చైతన్య

Jan 1,2024 21:38
ఎన్నికల బరిలో ఉంటా..డికె ఆదికేశవులు మనవరాలు చైతన్య

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ 2024 ఎన్నికల బరిలో తాను ఉంటానని జనసేన పార్టీ నుంచి తాను పోటీ చేయనున్నట్లు మాజీ ఎంపి, డికె ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య స్పష్టం చేశారు. సోమవారం స్థానిక లక్ష్మీనగర్‌ కాలనీలోని తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత తనను పోటీ చేయాలని కోరారని, ఎక్కడి నుండీ పోటీ అనే అంశం కుటుంబ పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. రాజకీయ కుటుంబ నేపధ్యం నుండీ వచ్చిన తాను ఎంఎల్‌ఏగా పోటీ చేయనున్నట్లు చెప్పారు.

➡️