ఎలుకల నివారణకు తక్షణ చర్యలు ప్రజాశక్తి వార్తకు స్పందన కేజీబీవీని విజిట్‌ చేసిన జిల్లా అధికార బందం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం ఆహారంలో పురుగులు ఉంటున్నాయని కొత్త సమస్య తెరమీదకు.. విలేకరుల వద్ద విద్యార్థుల మొర

Mar 6,2024 22:43
ఎలుకల నివారణకు తక్షణ చర్యలు ప్రజాశక్తి వార్తకు స్పందన కేజీబీవీని విజిట్‌ చేసిన జిల్లా అధికార బందం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం ఆహారంలో పురుగులు ఉంటున్నాయని కొత్త సమస్య తెరమీదకు.. విలేకరుల వద్ద విద్యార్థుల మొర

ఎలుకల నివారణకు తక్షణ చర్యలు ప్రజాశక్తి వార్తకు స్పందన కేజీబీవీని విజిట్‌ చేసిన జిల్లా అధికార బందం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం ఆహారంలో పురుగులు ఉంటున్నాయని కొత్త సమస్య తెరమీదకు.. విలేకరుల వద్ద విద్యార్థుల మొరప్రజాశక్తి- బైరెడ్డిపల్లి: కేజీబీవీ పాఠశాలలో ఎలుకలు స్వైర విహారం చేస్తూ విద్యార్థులను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కాగా మంగళవారం పలువురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడివారు విషయాన్ని ‘ప్రజాశక్తి’దష్టికి తీసుకొచ్చారు. బుధవారం ఈ విషయంగా ‘ఎలుక కొరకకే ప్లీజ్‌’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన సర్వశిక్ష అభియాన్‌ జిల్లా ఉన్నతాధికారులు బుధవారం పాఠశాలను సందర్శించారు. ఎస్‌ఎస్‌ఏ అధికారులు అజరు కుమార్‌, వెంకటరమణ, ఎంఈఓ సాయిలీల బందం అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. హాస్టల్‌ గదుల్లో ఎలుకలు సంచరిస్తూ కొరుకుతున్నట్లు విద్యార్థులు వారి దష్టికి తీసుకువచ్చారు. తక్షణ చర్యలుగా పాఠశాలలో బోన్లు ఏర్పాటు చేసి ఎలుకల నివారణకు దష్టి సారించాలని అక్కడి ఎస్‌వో స్వరూపను ఆదేశించారు. కాగా పాఠశాల వెలుపల వ్యర్ధాలు నిండిపోవడం, అపరిశుభ్రంగా ఉండడంతో ఎలుకలు వస్తున్నట్లు ఎస్‌ఓ స్వరూప వాళ్లకి వివరించారు. ఈ సందర్భంగా అజరు కుమార్‌ మాట్లాడుతూ ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, పాఠశాల పై దష్టి సారిస్తామని స్పష్టం చేశారు.అంకుల్‌.. మరి భోజనం సంగతేంటి.. ”అంకుల్‌.. ఇక్కడ పెడుతున్న భోజనంలో పురుగులు ఉంటున్నారు.. కాస్త మంచి భోజనం పెట్టేలా మాట్లాడుతారా..” అంటూ విద్యార్థులు బుధవారం పాఠశాలకు వచ్చిన విలేకరులతో చాటుగా వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం అస్సలు బాగుండటం లేదని, పురుగులు ఉండటానికి చూసి రోజు తినేప్పుడల్లా ఒకింత ఆందోళన పడుతున్నట్లు ఆ విద్యార్థులు వాపోయారు.భయం భయంతో.. పురుగులు ఉన్న విషయాన్ని టీచర్లకు చెబితే.. ఏదోలా మాట దాటేసి అదే అన్నాన్ని పెడుతున్నట్లు విద్యార్థులు విలేకరులతో చెప్పారు. తాము చెప్పినట్లు తెలిస్తే ఇబ్బంది పెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఆ విద్యార్థుల మాటలు విన్న స్థానిక విలేకరులు అక్కడికి వచ్చిన ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లారు. విలేకరులకు చెబితే సమస్య తీరుతుందని ఆ బాలికలు భావించి విషయాన్ని వెల్లపుచ్చటం అక్కడివారిని ఆశ్చర్యాన్ని గురిచేసింది.ఊరు మారినా.. తీరు మారలా.. బైరెడ్డిపల్లి కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌ఓ, మరో అధికారిని గతంలో ఇరువురు ఎర్రావారిపాళ్యం మండలంలోనూ పని చేశారు. అక్కడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించి హౌస్‌ విమర్శలు వారి సొంతం చేసుకున్నట్లు అందిన సమాచారం.

➡️