ఓల్డ్‌ఏజ్‌ హోమ్‌ను తనిఖీ చేసిన జెడ్పి సీఈవో

ఓల్డ్‌ఏజ్‌ హోమ్‌ను తనిఖీ చేసిన జెడ్పి సీఈవో

ఓల్డ్‌ఏజ్‌ హోమ్‌ను తనిఖీ చేసిన జెడ్పి సీఈవోప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: స్థానిక తపో వనం లోని ‘ఓల్డ్‌ ఏజ్‌ హోంను, వికాస్‌ విహార్‌ స్కూల్‌ (రాస్‌ )ను జడ్పి సిఇవో ప్రభాకర్‌రెడ్డి ఆదివా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లోని వృద్ధులకు కనీస వసతులను పరిశీలించి, ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా? లేవా? పరిశీలించి, వృద్ధులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం వికాస్‌ విహార్‌ స్కూలులో విద్యార్థుల హాజరు పట్టికను, బోధనా తరగతులను, హాస్టల్‌ను, స్టోర్‌ రూమును, వంట గదిని, కనీస వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ‘బోధన ఎలా వుంది? మీరు ఏమి నేర్చుకున్నారు?’ అని ప్రశ్నించి, విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు.

➡️