కల్తీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించాలి

Jan 6,2024 22:56
కల్తీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించాలి

– మండల సమావేశంలో సభ్యుల డిమాండ్‌ప్రజాశక్తి-వికోట: మండలంలో కల్తీ విత్తనాలు విక్రయాలపై సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్‌ చేశారు. శనివారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ యువరాజ్‌ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. మండల అధికారులు వారి శాఖలకు సంబందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సభలో వివరించారు. ఇటీవల మండలంలో నకిలీ విత్తనాలు విక్రయాలు జరగడం పట్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాటి విక్రవాయాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సభ్యలు డిమాండ్‌ చేశారు. దరఖాస్తు పట్టా భూములుగా మార్చే ప్రక్రియకు లబ్ధిదారులు సహకరించే విధంగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని తహశీల్దార్‌ చిట్టిబాబు కోరారు. మండల పరిధిలో చేపట్టిన సిమెంట్‌ రోడ్డు భవనాల నిర్మాణాలను పూర్తి చేసి బిల్లులకు సిద్ధం చేయాలని ఎంపీపీ సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్‌ డెవలెప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాలాగురునాథ్‌, వైస్‌ ఎంపీపీలు లక్ష్మణ్‌రెడ్డి, తమిమ్‌ఖాన్‌, జెడ్పీ ప్రత్యేక ఆహ్వానితులు గౌస్‌, సింగల్‌ విండో ఛైర్మన్‌ శ్రీరాములురెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ, సామజిక సలహాదారు అమర్నాథ్‌, ఎంపీడీఓ మహమ్మద్‌ రఫీ, సిఐ లింగప్ప, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

➡️