కల్పవక్షం లాంటిది కాంగ్రెస్‌ పార్టీ – జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్‌

Dec 28,2023 22:24
కల్పవక్షం లాంటిది కాంగ్రెస్‌ పార్టీ - జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్‌

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీ పేదలకు కల్పవక్షం లాంటిదని చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పోటుగారి భాస్కర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ జండా ఆవిష్కరించారు. అనంతరం భాస్కర్‌ మాట్లాడుతూ భారతీయులను బ్రిటిష్‌ వారి బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించి, బ్రిటిష్‌ వారిని తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన పార్టీ అని పోటుగారి భాస్కర్‌ కొనియాడారు. ఎంతోమంది కాంగ్రెస్‌ నాయకులు ప్రాణాత్యాగాలు చేసారని, అలాంటి కాంగ్రెస్‌ పార్టీలో ఉండటం తమ అదష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో చిత్తూరు అసెంబ్లీ కన్వీనర్‌ పూతలపట్టు ప్రభాకర్‌, జీడీ నెల్లూరు అసెంబ్లీ కన్వీనర్‌ కలికిరి నారాయణ స్వామి, జిల్లా ఓబీసీ సెల్‌ చైర్మన్‌ రావూరి పూర్ణ చంద్రశేఖర్‌, పీసీసీ డెలిగేట్‌ ఏపీ పరదేశి, సమన్వయ కమిటీ సభ్యులు గోవర్ధన్‌ రెడ్డి, కన్నన్‌, ధనలక్ష్మి, రాణి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. నగరి: నగరి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో 139 వ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నగరి కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు భానుమూర్తి, నటరాజ మొదలియార్‌, ఢిల్లీ, దేశయ్య, చిరంజీవి రెడ్డి, కేశవులు, కుమార్‌, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

➡️