గ్రామీణ పాలనలో నూతన ఒరవడిశ్రీ ఏ రాష్ట్రంలో సాధ్యంకాని సంక్షేమం ఏపీలో అమలైందిశ్రీ జెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు

కార్పొరేట్‌కు కొమ్ముకాస్తారా.?ఆసుపత్రిపై పేదల ఆశలు ఆవిరి చేస్తారా.? శ్రీ చిత్తూరు ప్రధాన ఆసుపత్రిని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి శ్రీ ఆసుపత్రిని మెడికల్‌ కాలేజీగా మార్పు చేయాలి శ్రీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని పూర్తిగా ప్రైవేటుపరం చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలని అఖిలపక్ష నాయకులు, ప్రజాసంఘ నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం నగరం లోని జనసేనపార్టీ కార్యాలయంలో అఖిల పక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జనసేన నాయకులు యశ్వంత్‌ అధ్యక్షతన నిర్వహిం చారు. సమావేశంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి యస్‌.నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, జనసేనపార్టీ జిల్లా నాయకులు ఎన్‌.దయారాం, బహు జన సమాజ్‌ పార్టీ నాయకులు లోకనాదం, లోక్‌సత్తా పార్టీ నాయకులు రాంబాబులు మాట్లాడుతూ చిత్తూరు ప్రభుత్వం ప్రధాన ఆస్పత్రిని ఇప్పటికే లీజుకు ఇవ్వడమే కాకు ండా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కూడా పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. పేద సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వైద్యం సౌకర్యన్ని ప్రభుత్వం దూరం చేసు ్తన్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్‌ పరం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుప త్రిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని, అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఆసుపత్రిని తరలించ కుండా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు జిల్లా ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే కొన సాగించే విధంగా పేద సామాన్య మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని కోరారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిపై రేపు అమరావతిలో జరుగు తున్న సమావేశంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసా గించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్ట నున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి గోపీనాథ్‌, ఏఐటీయూసీ నాయకులు దాసరి చంద్ర, ప్రజాసంఘాల నాయకులు కే.మణి, ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు ఎం. సుబ్రహ్మణ్యం, ఎస్‌.గుర్రప్ప, మహిళా సమాఖ్య జిల్లా నాయకులు కే.విజయ గౌరీ, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకు లు ధనుంజయ, జనసేన నాయకులు లో చన్‌, పుష్ప, వెంకటేష్‌, మహిళా సమైక్య న గర నాయకులు జమీలాబీ, కుమారి, కోమ ల, ఏఐవైఎఫ్‌ నాయకులు బాలాజీ రావు, రమేష ్‌బాబు, జయశంకర్‌, రిషికేశవ పాల్గొన్నారు.

గ్రామీణ పాలనలో నూతన ఒరవడిశ్రీ ఏ రాష్ట్రంలో సాధ్యంకాని సంక్షేమం ఏపీలో అమలైందిశ్రీ జెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులుప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ పాలనలో నూతన ఒరవడి సంతరించుకున్నదని జెడ్పీ ఛైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. సోమవారం చిత్తూరు సీఎంఎస్‌ఎస్‌ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులకు నాలుగు రోజులు పాటు డిజిటలైజేషన్‌, సుస్థిరాభివృద్ధి, సర్వీస్‌ రూల్స్‌ గురించి నిర్వహించే సదస్సును జెడ్పీ ఛైర్మన్‌, జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, డిఎల్‌డిఓ రవికుమార్‌లతో కలిసి ప్రారంభించారు. జెడ్‌పి ఛైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా ఉద్యోగాలను ఏకకాలంలో కల్పించి గ్రామీణ స్థాయిలో ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 536కు పైగా సేవలను అందించడం జరుగతోందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా అన్ని సంక్షేమ అభివద్ధి పథకాలు అర్హులందరికీ చేర్చడం జరుగుతోందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఈ వ్యవస్థ పని తీరును పరిశీలించడం జరిగిందన్నారు. సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న సచివాలయ ఉద్యోగులు సుస్థిరాభివృద్ధి సూచికలు, డిజిటలైజేషన్‌, సర్వీస్‌ రూల్స్‌ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అవసరమన్నారు. టిసిఐఎల్‌ కార్యదర్శి లలితమ్మ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులకు డిజిటలైజేషన్‌, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు, పేదరికం రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి, సర్వీస్‌ రూల్స్‌ గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సచివాలయ ఉద్యోగుల అందరికీ ఈ కార్యక్రమాన్ని మరో 52 రోజులపాటు వివిధ ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 31 మండలాల నుంచి పలువురు సచివాలయ కార్యదర్సులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️