ఘనంగా ‘జీజేఎం’ పుట్టిన రోజు వేడుకలు

Jan 16,2024 22:26
ఘనంగా 'జీజేఎం' పుట్టిన రోజు వేడుకలు

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: తెలుగుదేశం సీనియర్‌ నాయకులు జిజేఎం ఛారిటుబల్‌ ట్రస్ట్‌ ఛైర్మెన్‌ గురజాల జగన్మోహన్‌ పుట్టినరోజు వేడుకులు తెలుగుదేశం శ్రేణులు, జిజేఎం ట్రస్ట్‌ సిబ్బంది, జిజేఎం యువసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పుట్డినరోజును పురస్కరించుకొని చిత్తూరు నియోజకవర్గంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి కానుక పేరిట నిత్యవసర సరకులు పంపిణి చేశారు. ఆర్‌.కళ్యాణ మండపంలో నిర్వహించిన పుట్టినరోజులు వేడుకల్లో తెలుగుదేశం ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని జగన్మోహన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి ప్రసాద్‌ స్వయంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక గాంధీ విగ్రహం ఎదుట సోమవారం సాయంత్రం కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

➡️