ఘనంగా నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

Jan 23,2024 17:30
ఘనంగా నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ 41వ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా గంగాధర నెల్లూరు బస్టాండ్‌ కూడలిలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ థామస్‌ ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు రవిప్రకాష్‌, స్వామిదాస్‌, క్రిష్ణమనాయుడు, శ్రీధర్‌యాదవ్‌, దేవసుందరం,వెంకటేష్‌, జీవరత్నం, జ్యోతియాదవ్‌, రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️