చంద్రబాబు ది అసత్య ప్రచారాలు

Dec 30,2023 22:28
చంద్రబాబు ది అసత్య ప్రచారాలు

శ్రీ కుప్పం ప్రజలు టిడిపి నాయకుల్ని నమ్మరుశ్రీ ప్రతికా సమావేశంలో వైసీపీ నేతలు ఆరోపణప్రజాశక్తి -రామకుప్పం: కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు ప్రజలకు అసత్య ప్రచారాలు చేసి తన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారని, దీన్ని కుప్పం ప్రజలు ఎవరు నమ్మరని చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్ప, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌ పేర్కొన్నారు. శనివారం పత్రిక సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రం జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, వైయస్సార్‌ ఆసరా, వద్ధాప్య పెన్షన్లు పెంపు, విదేశీ విద్యకు ప్రాధాన్యత ప్రజాప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు పర్యటించి, మాయమాటలు చెప్పి గతంలో దొంగఓట్లతో గెలిచారన్నారు. పర్యటనల్లో ఆయన మాట్లాడుతూ వైసిపి నేతలు ఎవరైనా మైనింగ్‌లో సంబంధం ఉన్నదని నిరూపిస్తే ఎక్కడకైనా వస్తామని సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. పనులు చేపట్టడం ప్రజాసమస్యలు పరిష్కరించే ప్రభుత్వం అన్నారు. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌ కుప్పంకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 15 రోజుల్లో కుప్పంకు సాగు, త్రాగు నీరు అందించేందుకు కాలువ పనులు ముమ్మరంగా జరుగుతుందన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో టిడిపి కాంట్రాక్టర్లకు 450 కోట్లు టెండర్లు వదిలి దోచుకున్నారని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో నిధులు నష్టం జరిగిన హంద్రీనీవా కాలువ పనులు ఆగకూడదని పనులు చేపట్టారన్నారు. త్వరలో బైరెడ్డిపల్లి నుంచి రామకుప్పం, శాంతిపురం, కుప్పంకు కష్ణాజలాలు రాబోతున్నాయన్నారు. చంద్రబాబు గత 35 సంవత్సరాలుగా కుప్పంలో ఉన్న ప్రజలకు ఒక్క అభివద్ధి, పరిశ్రమ తీసుకురాకపోగా మాయమాటలు చెబుతున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వైసిపి నేతలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రాష్ట్రంలో 36వేల కిలోమీటర్లు సిసి రోడ్డు చిత్తశుద్ధితో వైసిపి ప్రభుత్వం వేసింది అన్నారు. చంద్రబాబు లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం అని ప్రచారాలు చేస్తున్నారే తప్ప కుప్పం ప్రజలు వైసిపికి మద్దతు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి పాడి రైతులకు లాభసాటిగా పాల ఉత్పత్తి అమూల్‌ డెయిరీలను తీసుకొచ్చారు. డీకేటి భూములను రెగ్యులైస్‌ భూములుగా మార్చారన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలు వైసిపి ప్రభుత్వంలో నిర్మాణాలు జరిగిందన్నారు. మినీ ఎయిర్పోర్ట్‌ కోసం రైతులను అన్యాయంగా సర్వనాశనం చేశారన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుప్పానికి ఏమి చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు బాబురెడ్డి, ఎంపీపీ సుబ్రహ్మణ్యం, కో కన్వీనర్‌ చంద్రారెడ్డి, సర్పంచులు మురళి, రాజగోపాల్‌, మోహన్‌ నాయక్‌, ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ వేణుగోపాల్‌ గౌడ్‌, నారాయణ స్వామి, మురుగేష్‌, నారాయణ రెడ్డి, జయప్ప, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.

➡️