చేతి కష్టమే రైతుకు ఆస్తి..ఏనుగుల దాడిలో నష్టమే జాస్తి.!

Dec 18,2023 23:11

చేతి కష్టమే రైతుకు ఆస్తి..ఏనుగుల దాడిలో నష్టమే జాస్తి.!శ్రీ రాగిమానుపెంటలో ఏనుగులు హల్‌చల్‌శ్రీ పంటలపై కొనసాగుతున్న దాడులుప్రజాశక్తి-బంగారుపాళ్యం: చేతికొచ్చే పంటలు ఏనుగుల దాడిలో ధ్వంసం అవుతుండటం పట్ల రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అప్పులు చేసి.. కష్టించి పండించిన పొలం చేతికందే సమయంలో ఏనుగులు దాడి చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని పంట పొలాల్లో ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి మండలంలోని రాగిమానుపెంట గ్రామంలో ఏనుగులు పంటలపై పడి ధ్వంసం చేశాయని రైతు హుస్సేన్‌ తెలిపారు. పంట చేతికొచ్చే దశలో ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని మానుకున్నారని తనకు జరిగిన నష్టం కూడా అలాంటిదేనన్నారు. ఇలా ఏనుగులు పంటలపై పడి నాశనం చేస్తుంటే అధికారులైనా ప్రత్యాన్మాయ చర్యలు తీసుకోకుంటే ఎలా అన్ని ప్రశ్నించారు. ఇకనైనా ఏనుగులను నియంత్రించి అడవుల్లోకి పంపే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందజేయాలని కోరారు.

➡️