జనవరి 5న ఓటర్ల జాబితా విడుదల: జేసి

జనవరి 5న ఓటర్ల జాబితా విడుదల: జేసి

జనవరి 5న ఓటర్ల జాబితా విడుదల: జేసి మార్పులు, చేర్పులకు సంబంధించి 9 లోపు దరఖాస్తు చేసుకోవాలిప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తీసివేతలకు సంబంధించి ఈనెల 9 లోపల దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు అన్నారు. బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌తో కలసి నిర్వహించారు. ఈసందర్భంగా జేసి మాట్లాడుతూ ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తీసివేతలకు సంబంధించి ఈ నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని, అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 2024 జనవరి 5న ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు తమ పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. బిఎల్‌ఓలు గత రెండు రోజులు పాటు వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలలో దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, క్షేత్రస్థాయిలో పరిశీలన కాలపరిమితి లోపల జరుగుతుందని అన్నారు. పూర్తి సమాచారం లేకపోతే పరిశీలన కష్టం అవుతుందని అటువంటి క్లైములు అపరిష్కతంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈసమావేశంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి పరదేశి, సిపిఎం ప్రతినిధి గంగరాజు, బిజెపి ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, వైఎస్‌ఆర్సిపి ప్రతినిధి ఉదయకుమార్‌, టిడిపి ప్రతినిధి ప్రభుతేజ లు పాల్గొన్నారు.

➡️