టిడ్కో..ఇంకెన్నటికో.!

Feb 9,2024 22:48
టిడ్కో..ఇంకెన్నటికో.!

టిడ్కో ఇండ్లు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే నెల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపధ్యంలో ఎన్నికల ఫలితాల తరువాతే టిడ్కో ఇండ్లకు మోక్షం కలిగేలా ఉంది. దాదాపు ఏడేళ్ళకు పైగా సొంత ఇంటి కోసం లబ్ధిదారులు కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ అధికార పార్టీ టిడ్కో ఇండ్లు పూర్తి చేశాం. గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని లబ్దిదార్లను ఊరిస్తూనే ఐదేళ్ళు గడిపేసింది.ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌ వైసీపీ తమ ప్రభుత్వ హయంలోనే టిడ్కో ఇండ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని గొప్పలు చెప్పుకున్నా.. రోడ్లు, వీధిలైట్లు, తాగునీరు, మురికి కాలువల నిర్మాణం వంటి మౌళిక వసతుల కల్పన ఆలస్యం చేయడంతో టిడ్కో ఇండ్ల కోసం బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్‌ చేసిన లబ్ధిదార్ల సొంత ఇంటి కళ నేరవేరక ఎదురు చూపులు తప్పడం లేదు. డబుల్‌ బెడ్‌ రూం ఇంటి కోసం ఒక్కొ లబ్ధిదారుడి వద్ద నుండి రూ.లక్ష డిపాజిట్‌ చేయించారు. బ్యాంకు నుండీ రూ.3.65లక్షలు తీసుకున్న బుణాన్ని విడతల వారిగా చెల్లించాల్సింటుంది. ఇంటి నిర్మాణం కోసం డిపాజిట్‌ చెల్లించిన లబ్ధ్దిదారుడి సొంత ఇంటి కళ నెరవేరకపోగా బ్యాంకు నుండి తీసుకున్న బుణాన్ని తిరిగీ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. టిడ్కో ఇండ్లు పట్ణణాల్లో నివసించే పేదలకు అపార్టుమెంట్‌ నిర్మించేలా గత టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అప్పటి ఉమ్మడి జిల్లా కేంద్రమైన చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో టిడ్కో ఇండ్ల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన లబ్ధిదారులకు నగర పాలక సంస్థ పరిధిలోని పెనుమూరు రోడ్డు సమీపంలోని పూనేపల్లి వద్ద 300చదరపు అడుగులు ఇళ్లు 2,256, 365 చదరపు అడుగుల గహాలు 240, 430 చదరపు అడుగుల గృహాలు 336మొత్తం 2,832 గృహాలను నిర్మించారు. ఏడేళ్ళ క్రింతం శంఖుస్థాపన చేసినా 2,832 టిడ్కో ఇండ్లు నేటికి పూర్తి చేసిన్నట్లు టిడ్కో కన్సల్టెంన్సీ చెబుతున్నా మౌళిక వసతుల కల్పనలో అలసత్వం కనిపిస్తోంది. ఏడాది క్రితమే పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే నిధుల కొరత కారణంగా మౌళిక వసతుల కల్పిన ఆలస్యమౌతున్నట్లు టిడ్కో కన్సల్టెంస్సీ ప్రతినిధులు చెబుతున్నారు. పూనేపల్లి వద్ద నిర్మిణం చేస్తున్న టిడ్కో అపార్టుమెంట్‌ గృహాలకు ఎలక్ట్రికల్‌, శానిటేషన్‌, రోడ్ల నిర్మాణం, మురికినీటి కాలువల నిర్మాణం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.సన్నగిల్లుతున్న ఆశలు టిడ్కో ఇండ్ల నిర్మాణం ఆలస్యమయ్యే కొద్ది లబ్దిదార్లులో సొంత ఇంటి కళ ఆశాలు సన్నగిల్లుతున్నాయనే చెప్పాలి. అనేక మంది తమ పేరు మీదు టిడ్కో ఇంటి నిర్మాణం జరుగుతోందన్న విషయాన్నే మరచిపోయారు. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుండీ బుణం తీసుకున్నాంటూ నోటీసులతో తడుముకుంటున్నారు. రూ.లక్ష డిపాజిట్‌ చేశాం. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు గ్రౌండ్‌ ప్లోర్‌లో ఇస్తామన్నారు. ఏడేళ్ళు గడచిపోయింది అతిగతి లేదు. ఎప్పటికి పూర్తి చేస్తారో.. అనే గంధరగోళం లబ్దిదార్లలో నెలకొంది. మరో వైపు పూనే పల్లి వద్ద నిర్మిస్తున్న టిడ్కో ఇండ్లకు రంగులు వేసినా మౌళిక వసతుల కల్పన పూరి చేసేందుకు మరో ఆరు నెలలకు పైగా పట్టే అవకాశం ఉన్నట్లు టిడ్కో కన్సెల్టెంస్సీ చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ టిడ్కో లబ్దిదార్లు ఇంటి యజమానులు కావాలంటే మరో ఆరు నెలలు ఆగాల్సిందే.. మొదట్లో పూనే పల్లి వద్ద ఇండ్ల నిర్మాణాలపై ఆసక్తి చూపిన లబ్దిదార్లకు నేడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. టిడ్కో ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరగా అందిచాలని లబ్దిదార్లు కోరుతున్నారు.

➡️