తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్‌

Dec 2,2023 22:45
తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్‌

కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌: 9491077356ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ :బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులతో మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతున్న నేపథ్యంలో ఈ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాస్థాయి అధికారులు మొదలు మండలస్థాయి అధికారులు, గ్రామస్థాయి వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 9491077356 అని తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని జలాశయాల వద్ద మరియు చెరువుల వద్ద నీటి నిల్వ సామర్థ్యం ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వాగులు వంకలు వద్ద ప్రజలు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండేలా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

➡️